Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో 16 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం హైదరాబాద్‌లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కేంద్రాల వద్ద ఒక్కో హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ప్రకటించారు.

కౌంటింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, ఏఆర్‌వోలకు శనివారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు.

హైదరాబాద్‌లో చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, ప్రధాన పోటీ మజ్లీస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ,  బిజెపి అభ్యర్థిని మాధవి లత మధ్య ఉంది. మజ్లీస్ పార్టీ 1984 నుండి హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని గెలుస్తోంది. కాంగ్రెస్ తన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను కూడా పోటీకి నిలబెట్టింది, బిఆర్ఎస్ పార్టీ గడ్డం శ్రీనివాస్‌ను ప్రతిపాదించింది.

సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, స్వతంత్ర అభ్యర్థిగా 1984 , 1989 మధ్య నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.  1989 నుండి 2004 వరకు లోక్‌సభ నియోజకవర్గానికి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆల్ ఇండియా మజ్లీస్ -ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు ఆయన పార్లమెంటు సభ్యులే.

Madhavi and Asaduddin

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News