కూలీలపై బిజెపి మద్దతుదారు జగదీశ్‌గౌడ
దాడి చేయడంతో బాధిత మహిళకు గర్భస్రావం
కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో నిందితులు
చిక్‌మగళూరు: చిక్‌మగళూరు జిల్లాలో బిజెపి మద్దతుదారుడు జగదీశ్ గౌడ దళితులను నిర్బంధించి వేధింపులకు గురిచేశాడు. గౌడ తన కాఫీతోటలో తమను 15రోజులపాటు నిర్బంధించి దౌర్జన్యం చేశాడని బాధితులు ఆరోపించారు. గౌడ తీవ్రంగా దాడి చేయడంతో గర్భస్రావమైందని బాధిత గర్భవతి ఒకరు తెలిపారని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై నమోదు చేసి బాధితురాలిని ఆసుపత్రికి వైద్యచికిత్సకోసం తరలించామని అధికారులు తెలిపారు. జగదీశ్ గౌడ కుమారుడు గౌడపై ఠళితులను వేధింపులకు గురిచేసినందుకు చట్టప్రకారం అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. జగదీశ్ గౌడ చర్యలను అధికార బిజెపి సైతం ఖండించిఅతడిని దూరంపెట్టింది. ఈ సందర్భంగా అధికారప్రతినిధి వేణుగోపాల్ మాట్లాడుతూ గౌడ బిజెపి నాయకుడనే ఆరోపణలను ఖండించారు. జగదీశ్‌గౌడ కార్యకర్త, సభ్యుడు కాదని కేవలం బిజెపి మద్దతుదారుడు మాత్రమే అన్నారు. ఇతర ఓటర్లుమాదిరిగానే అతడు కూడా ఒక ఓటరు అన్నారు.
కాగా జెనుగడ్డే గ్రామంలో ఉన్న కాఫీతోటలో రోజువారీ కూలీలుగా వీరు తమ యజమాని నుంచి రుణం తీసుకున్నారని, అప్పును తిరిగి చెల్లించకపోవడంతో వారిని గౌడ నిర్బంధించాడని చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్‌తెలిపారు. ఈ నెల కొంతమంది బలహన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి గౌడ తమ బంధువులను బంధించి వేధించాడని చేశారు. అయితే తరువాత రోజు వారు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మరుసటిరోజు బాధిత గర్భవతి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశామని అధికారి తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రాంతానికి కొంతమంది ఓ రూమ్‌లో బంధించి ఉండటాన్ని గుర్తించి వారిని విడుదల చేశాం. గత గృహనిర్బంధంలో ఉన్నారు. నాలుగు కుటుంబాలకు చెందిన 16మంది ఉన్నారు. వీరంతా ఎస్సీలుగా గుర్తించాం. అప్పుతీసుకున్నవారిలో కొంతమంది మిగిలినవారిని గౌడ నిర్బంధించి వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు.