Wednesday, November 13, 2024

16 రోజులు 54 సభలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే ఈ నెల 15 నుంచి ప్రా రంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 13) నాటికి 12 రోజు ల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 9 వ తేదీ వరకుమరో 12 నియోజకవర్గాల్లో సిఎం కెసిఆర్ నియోజకవర్గాల్లో పర్యటన చేపట్టనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు 16 రోజులపాటు కెసిఆర్ నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భా గంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్ర జా ఆశీర్వాద సభల్లో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినే త పర్యటనముగియనుంది.దాంతోమొ త్తం 96నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.

సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
నవంబర్ 13 : దమ్మాపేట్,బుర్గంపాడ్, నర్సంపేట
నవంబర్ 14 : పాలకుర్తి, హాలియా(నాగార్జునసాగర్), ఇబ్రహీంపట్నం
నవంబర్ 15 : బోధన్, నిజామాబాద్(అర్బన్), ఎల్లారెడ్డి, మెదక్
నవంబర్ 16 : అదిలాబాద్, బోథ్, నిజామాబాద్(రూరల్), నర్సాపూర్
నవంబర్ 17 : కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల్
నవంబర్ 18 : చేర్యాల్(జనగాం)
నవంబర్ 19 : అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి
నవంబర్ 20 : మానకొండూర్, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ
నవంబర్ 21 : మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
నవంబర్ 22 : తాండూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి
నవంబర్ 23 : మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు
నవంబర్ 24 : మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
నవంబర్ 25 : హైదరాబాద్‌లో బహిరంగ సభ
నవంబర్ 26 : ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27 : షాద్‌నగర్, చేవెళ్ల, ఆంధోల్, సంగారెడ్డి
నవంబర్ 28 : వరంగల్(ఈస్ట్, వెస్ట్), గజ్వేల్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News