Sunday, December 22, 2024

‘చండీపురా’కు 16 మంది బలి..50 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌ను చండీపురా వైరస్ వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, గుజరాత్ ఆరోగ్యమంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం లోని హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా కేసులు నమోదు కాగా, వీరిలో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పటేల్ తెలిపారు. ఈ వైరస్ మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చాయని, రాష్ట్రంలో మొత్తం 50 కేసులు నమోదయయ్యాయన్నారు.

దీని బారిన పడి 16 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో చండీపురా వైరస్ పరిస్థితులను సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రి హృషికేష్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు, ఈ సమావేశానికి హాజరయ్యారు. వైరస్ నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News