Friday, November 22, 2024

పొరుగు రాష్ట్రాల 16 ధాన్యం లారీలు సీజ్

- Advertisement -
- Advertisement -

16 Grain Lorries Seized in Telangana

కర్ణాటక నుంచి మిర్యాలగూడకు వడ్డు తరలింపు
రాష్ట్రంలో అధిక ధర దక్కడం వల్లే ఈ విధంగా రవాణా
పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తరలిస్తున్న స్థానిక వ్యాపారులు

మఖ్తల్: రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర పక్కాగా దక్కడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు తెలంగాణకు అక్రమ పద్దతుల్లో ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టి సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినా తాజాగా కర్ణాటక నుంచి మిర్యాలగూడకు తరలిస్తున్న ధాన్యాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చేగుంట చెక్‌పోస్ట్ వద్ద అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. మఖ్తల్ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం కర్నాటక నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు అక్రమంగా ధాన్యం తరలిస్తున్న 16 ధాన్యం లారీలను మఖ్తల్ శివారులో పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలో ధాన్యానికి మద్దతు ధర దక్కకపోవడం, తెలంగాణలో క్వింటాల్‌కు రూ.1960 వరకూ మద్దతు ధర లభించడంతో కొంతమంది బ్రోకర్లు, వ్యాపారులు అక్కడ నుంచి ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలుచేసి ఇక్కడ మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అదీకాగా కర్ణాటకలో ధాన్యానికి తక్కువ ధర పలకడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.

ఇక్కడి నుంచి కొంతమంది వ్యాపారులు రాష్ట్ర సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వీలు చూసుకొని మిర్యాలగూడలోని మిల్లులకు తరలిస్తున్నారు. గడచిన పక్షం రోజుల కిందట ఈదే మాదిరిగా ఎపి నుంచి వస్తున ధాన్యం లారీలను సైతం నల్లగొండ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రభుత్వం సైతం రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం వల్ల, ఎపి ధాన్యాన్ని అక్కడి వ్యాపారులు తెలంగాణకు తీసుకువచ్చి విక్రమాలు జరిపారు. దీన్ని గమనించిన రాష్ట్ర అధికారులు దానికి అడ్డుకట్ట వేశారు. తాజాగా కర్ణాటక నుంచి కూడా ఇదేవిధంగా ధాన్యం తరలించడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకని సరిహద్దు ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, చేగుంట చెక్‌పోస్ట్ నుంచి ధాన్యం లారీలు మఖ్తల్ మీదుగా మిర్యాలగూడకు తరలిస్తుండగా సిఐ సీతయ్య, ఎస్సై రాములు నేతృత్వంలో పోలీసులు వాటిని తనిఖీలు చేసి సీజ్ చేశారు. తెలంగాణలో ధాన్యానికి ఎక్కువ ధర ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై నిషేధం ఉందని, చెక్ పోస్టుల వద్ద నిఘాను సైతం ఉల్లంఘించి ధాన్యం తరలిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ధాన్యం లారీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, లారీలను సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. ఎవరైనా అక్రమ పద్దతుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలిస్తే, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News