Thursday, January 23, 2025

పడవ మునిగి 16మంది వలసదారులు మృతి

- Advertisement -
- Advertisement -

టర్కీ( తుర్కియే) తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో 16మంది వలసదారులు మృతిచెందినట్లు టర్కీ కోస్టుగార్డు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో నలుగురు పిల్లలున్నట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. కనక్కలే ప్రావిన్స్‌లోని ఎసేబాత్ పట్టణం సమీపంలోని తీరప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

కోస్టుగార్డు సిబ్బంది సముద్రంలోంచి ఇద్దరిని కాపాడారని, మరో ఇద్దరు తమంతట తామే ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గురయిన సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియరాలేదు. కోస్టుగార్డు సిబ్బంది రెండు హెలికాప్టర్లతో ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారని వారు చెప్పారు. వలసదారులు ఏ దేశానికి చెందిన వారో ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదని గవర్నర్ ఇల్హామి అక్తాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News