Saturday, January 11, 2025

బస్సు, ట్రక్కు ఢీ: 16మంది దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

పకూర్: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 16 మంది అక్కడికక్కడే మరణించగా మరో 26 మంది గాయపడ్డారు. అమ్రాపరా పోలీసు స్టేషన్ పరిధిలోని పడేర్‌కోలా గ్రామం వద్ద గోవింద్‌పూర్-సాహిబ్‌గంజ్ రాష్ట్ర హైవేపై ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హర్వా నుంచి దేవగఢ్ జిల్లాలోని జసిడికి 40మంది ప్రయాణికులతో బస్సు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్‌డి పాశ్వాన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరిని రాంచిలోని రాజేంద్ర వైద్య శాస్త్రాల సంస్థకు తరలించినట్లు ఆయన చెప్పారు. ప్రమాదంలో బస్సు నుజ్జు నుజ్జు కావడంతో పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. గ్యాస్ కటర్ల సాయంతో వారిని వెలుపలకు తీసుకువచ్చారు.

16 Killed in Road Accident in Jharkhand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News