Saturday, February 22, 2025

దుబాయ్‌లో అగ్ని ప్రమాదం… 16 మంది సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

దుబాయ్: దుబాయ్‌లోని అల్‌రాస్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో 16 మంది సజీవదహనం కాగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మృతులు నలుగురు భారతీయులు ఉండగా కేరళకు చెందిన దంపతులు రిజేష్(38), జెషీ(32), మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. భవనం నిర్మించేటప్పుడు నిర్మాణ సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇండియాకు మృతదేహాలను పంపిస్తామని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.

Also Read: కదులుతున్న రైలులో ప్రయాణికుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News