Monday, December 23, 2024

పేలిన ట్రాన్స్‌ఫార్మర్: 16 మంది మృతి… మృతులలో ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ట్రాన్స్‌ఫార్మర్ పేలి నలుగురు పోలీసులతో పాటు మొత్తం 16 మంది మృతి చెందిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై వంతెన ఏర్పాటు చేశారు. వంతెన వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పేలిడంతో కరెంట్ తీగలు రెయిలింగ్ తాకాయి. కరెంట్ షాక్‌తోనే 16 మంది మృతి చెందారు. ఇంకా పది మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులలో సబ్ ఇన్స్‌స్పెక్టర్, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవాహం జరగడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read: ప్రియురాలి భర్తను ఆరు ముక్కలుగా నరికి… సమాధిపై మామిడి మొక్కను నాటాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News