Sunday, January 19, 2025

కుక్క దాడిలో 16 నెలల బాలుడికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కొణిజర్ల:అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చంపేశాయి. అత్యంత దారుణమైన ఈ విషాద సంఘటన ఆదివారం నాడు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది .వివరాలలోకి వెళితే..స్ధానికుల కథనం ప్రకారం 16 నెలల బాలుడిపై వీధి కుక్క దాడికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఊటుకూరి గణేష్, రమాదేవి దంపతులకు చెందిన కుమారుడు సిద్ధార్థ రావణ్ (16 నెలలు) కు మధ్యాహ్నం

సమయంలో తల్లి రమాదేవి ఇంటి ముందు అన్నం తినిపిస్తుండగా మధ్యలో తాగునీటిని తెచ్చేందుకు బాలుడిని, అన్నం ప్లేట్‌ను అక్కడ ఉంచి ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలోనే ఆరుబయట తిరిగే కుక్క ఇంటి ఆవరణలోకి వచ్చి ప్లేట్‌లో ఉన్న అన్నం తినే క్రమంలో బాలుడు ప్లేట్‌ను పట్టుకోగా కుక్క బాలుడి ముఖంపై కరిచింది. దీంతో ముక్కు, కళ్ళు, చెవి కింద భాగంలో గాయాలయ్యాయి. గమనించిన తల్లి హుటాహుటీన స్థానిక పీహెచ్‌సికి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు ముందు వ్యాక్సిన్ అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సిఫారసు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News