Sunday, January 19, 2025

సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటి ఉదయం నుంచి రిజర్వేషన్‌లకు అవకాశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు మరిన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

శనివారం ఉదయం నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 7 నుంచి 18 వరకు తెలంగాణ, -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు నడువనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News