Sunday, December 22, 2024

అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

16 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులు

ఓడిఎఫ్ + పట్టణాలుగా 70
ఓడిఎఫ్ ++ పట్టణాలుగా 40
గుర్తింపు అవార్డులు రావడంపై
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022’లో భాగంగా తెలంగాణలోని 16 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ అవార్డులు ద క్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సం బంధించిన సమస్యల పరిష్కారాలు, గార్బెజ్ ఫ్రీ సిటీ (జిఎఎఫ్‌సి) వాటికి స్టార్ రేటింగ్ ఇచ్చి (జులై 2021 నుంచి జనవరి 2022) ఈ అవార్డులకు ఎంపిక చే శారు. రాష్ట్రంలోని పురపాలికలకు ఈసంవత్సరం కూడా భారీగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు రావడం పై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రగతి వంటి రెండు ప్రధానమైన కార్యక్రమాలతో పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యం అయ్యిందని ఆయన తెలిపారు. కేవలం పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతి నెల రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో పట్టణాల్లో ప్రజలకు కావలసిన ప్రాథమిక సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.

వినూత్నమైన విధానాలు, నిర్ణయాలతో రాష్ట్రం ముందుకు

దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ద్వారా అటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవకాశం కలిగిందని, దీంతో పాటు అధికారులు తమ విధులను మరింత సమర్ధవంతంగా నిర్వహించేదుకు స్పూర్తి కలిగిందన్నారు. పురపాలక శాఖ తరపున పట్టణాల్లో పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధి ద్వారా గ్రీనరీ పెంచడం, పట్టణ హరిత వనాలు ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం వంటి ప్రాథమిక అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించడంతో పట్టణాల్లో మార్పు వేగంగా సాధ్యమైందని కెటిఆర్ తెలిపారు. తాజాగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు, ఆదర్శ గ్రామాలుగా అవార్డులు సాధించాయని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి పట్టణాలు గ్రామాలు, పట్టాణాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో దక్కుతున్న అవార్డులే నిదర్శనమని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం తనదైన వినూత్నమైన విధానాలు, నిర్ణయాలతో అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా, ఆదర్శ నమూనాగా నిలుస్తుందని, వరుసగా తెలంగాణలోని పట్టణాలకు దక్కుతున్న ఈ అవార్డుల ద్వారా పట్టణ అభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు

90 అంశాల ప్రాతిపదికన…

పారిశుద్ధం, మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి దేశవ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ స్వచ్చసర్వేక్షణ్ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించింది. ఈ పోటీల్లో భాగంగా తెలంగాణలోని 16 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులను దక్కించుకున్నాయి. వీటిని ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు. శాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదోడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్వీడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, ప్రజల అవగాహన, సిటీజన్ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులకు ఎంపికైన పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులను ప్రధానం చేస్తారు. దీంతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానిక సంస్థలను (ఓడిఎఫ్) ODF + గా, 40 పట్టణ స్థానిక సంస్థలను (ఓడిఎఫ్++)ODF++ గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్ +, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను (ఓడిఎఫ్) ODF పట్టణాలుగా ప్రకటించింది.

అవార్డులకు ఎంపికైన 16 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల వివరాలు ఇలా….

1.ఆదిభట్ల మున్సిపాలిటీ

2. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ

3. భూత్పూర్ మున్సిపాలిటి

4. చండూర్ మున్సిపాలిటీ

5. చిట్యాల మున్సిపాలిటీ

6. గజ్వేల్ మున్సిపాలిటీ

7. ఘట్ కేసర్ మున్సిపాలిటీ

8. హుస్నాబాద్ మున్సిపాలిటీ

9. కొంపల్లి మున్సిపాలిటీ

10. కోరుట్ల మున్సిపాలిటీ

11. కొత్తపల్లి మున్సిపాలిటీ

12.నేరుడుచర్ల మున్సిపాలిటీ

13. సికింద్రాబాద్, కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటీ

15. తుర్కయాంజల్ మున్సిపాలిటీ

16. వేములవాడ మున్సిపాలిటీ

రాష్ట్రంలో పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో చేపట్టారు. మొదటి విడత 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు, రెండో 2020 జూన్ 1 నుంచి 8 వరకు, మూడో విడత 2021 జూలై 1 నుంచి 10 వరకు , నాలుగో విడత 2022 జూన్ 3 నుంచి 18 వరకు నిర్వహించారు.

1.57లక్షల వ్యక్తిగత మరుగుదోడ్ల నిర్మాణం

రాష్ట్రంలోని పట్టణాల్లో డీఆర్సీసి 206లు, బయోమైనింగ్ లెగసీ వెస్ట్ , ఎఫ్‌ఎస్‌టిటిపిలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా 1.57లక్షల వ్యక్తిగత మరుగుదోడ్లు, 9,088 ప్రజా మరుగుదోడ్లను ప్రభుత్వం నిర్మించింది. 4713 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయడంతో పాటే ఫీకల్ స్లడ్జ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్ (FSTP) లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే 20 పూర్తి కాగా మరో 11 పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 108 వివిధ దశల్లో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News