Sunday, December 22, 2024

కలెక్టర్ పై దాడి కేసు.. పట్నం నరేందర్ రెడ్డితో సహా 16 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్‌ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. లగచర్ల కేసు రిమాండ్ రిపోర్ట్‌లో 46 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడికి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేసినట్లు అనుమానించిన పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగినేని సురేష్ కు ఆయన దాడికి ముందు దాదాపు 36 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయన పాత్ర ఉందని భావించిన పోలీసులు బుధవారం ఉదయం ఆయనను అరెస్టు చేశారు.

ఇక, సురేష్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. నిందితులందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్.. ప్రభుత్వ అధికారులపై దాడికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, ప్రభుత్వం అక్రమంగా తమ నేతలను అరెస్టు చేస్తుందని కెటిఆర్, హరీశ్ రావు మండిపడుతున్నారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News