Tuesday, January 21, 2025

అమర్‌నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

16 People dead in Amarnath Tour

శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కొండ చరియలు ఏమి విరిగిపడటంలేదని భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు ఇబ్బంది కలుగుతోందని ఎన్ డిఆర్ఎఫ్ డిజి అతుల్ కర్వాల్ తెలిపారు. అమర్ నాథ్ గుహ నుంచి  సుమారు 15 వేల మంది భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గాయపడిన 65 మందిని ఆర్మీ హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలించారు. జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News