Monday, December 23, 2024

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16మంది కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

థానే: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానే జిల్లాలోని షహపూర్ సమీపంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు గర్డర్ యంత్రం కుప్పకూలింది. దీంతో 16మంది కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

యంత్రం క్రింద చిక్కుకుని గాయపడిన వారిని ముగ్గురిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పనుల్లో పిల్లర్లపై గర్డర్ యంత్రం ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News