Monday, December 23, 2024

చైనాలో ఆకస్మిక వరదలకు 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

16 people died in sudden floods in China

బీజింగ్: చైనాలోని వాయువ్య ఖింఘై ప్రావిన్పులో బుధవారం రాత్రి సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది మరణించగా మరో 36 మంది గల్లంతయ్యారు. దతోంగ్ హు, టు స్వయంపాలిత కౌంటీలలో ఆకస్మిక వరదలు సంభవించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని జిన్హువ వార్తా సంస్థ గురువారం తెలిపింది. ఆకస్మిక వరదలకు ఆరు గ్రామాల్లోని 1,517 ఇళ్లు ధ్వంసం కాగా 6,245 మంది నిరాశ్రయులయ్యారని వార్తాసంస్థ తెలిపింది. భారీ వర్షాలకు తోడు పర్వతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News