Saturday, April 26, 2025

వెనిజులాలో వాహనాలు ఢీకొని 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కారకస్ : వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెనెజులా లోని ఓ హైవేపై బుధవారం ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ సంఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News