దక్షిణ పాకిస్థానలో వేగంగా వెళుతున్న వ్యాన్ లోయలో పడిపోవడంతో మహిళలు, పిల్లలు సహా కనీసం 16 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సింధ్ ప్రాంతంలోని జంషోరో జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. అందిన వివరాల ప్రకారం, కొండ ప్రాంతంలో వ్యాన్ డ్రైవర్ అతి వేగం కారణంగా వాహనం అదుపు తప్పి గంటలో పడిపోయింది. 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని సమాచారం.
పంజాబ్ ప్రాంతంలోని లాపారి నుండి సింధ్ ప్రాంతంలోని బాడిన్‌కు కోల్హి తెగకు చెందిన వ్యక్తులను వ్యాన్ తీసుకెళుతుండగా దర్ఘటనకు గురయింది. పోలీసులు, రెస్కూ టీమ్ ఘటనా స్థలికి చేరకుని మృతులను, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బలూచిస్థాన్‌లో గోధుమ పంట కోత పనిని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న కార్మికులను వ్యాన్ తీసుకెళుగుండగా ప్రమాదానికి గురయిందని డిప్యూటీ కమిషనర్ గజన్‌ఫర్ ఖాద్రీ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.