Monday, December 23, 2024

ఆర్టీసీలో 16 మందికి పదోన్నతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మెదక్ ఆర్టీసీ రీజియన్‌లో 16 మందికి సూపర్‌వైజర్లుగా పదోన్నతి లభించింది. గత 25 సంవత్సరాలుగా కండక్టర్లుగా, డ్రైవర్లుగా సర్వీసు చేస్తున్న వారికి ఈ మేరకు పదోన్నతి కల్పించారు. 13 మంది కండక్టర్లు, 3 గురు డ్రైవర్లు వీరిలో ఉన్నారు.ఈ సందర్భంగా సంగారెడ్డి రీజియన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆరీఎం సుదర్శన్ అభినందించారు. ఆర్డర్ కాపీలను అందించారు. సంస్థ అభివృద్ధికి మరింతగా పాటుపడాలని, ఆదాయాన్ని పెంచాలని సూచించారు. పదోన్నతి పొందిన వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా సంస్థలో పని చేయడం ద్వారా తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగారని వివరించారు. తమ సంతోషం వెలిబుచ్చారు. బికెరెడ్డి అనే ఉద్యోగి మాట్లాడుతూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాదిరిగా తమ పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించారన్నారు. ఇదంతా సంస్థలో తాము పని చేయడం వల్లనే సాధ్యమయిందన్నారు.తనను స్ఫూర్తిగా తీసుకుని తన పిల్లలు ఎదిగారని చెప్పారు. డిజిఎం దైవాదీనం,జ్యోత్స, సుజాత,సంపత్, వెంకటేశం, యూనియన్ నాయకులు పల్లె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News