Monday, December 23, 2024

క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికోలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మ‌స్ ముందస్తు వేడుక‌లో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రం సాల్వాటియెర్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి క్రిస్మ‌స్ ముంద‌స్తు సెలబ్రేషన్స్ నిర్వ‌హించారు. ఈ సెలబ్రేషన్స్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఎంజాయ్ చేసి తిరిగి వెళ్తుండగా..ఆరుగురు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వంటనే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చనిపోయినవారిలో దాదాపు అందురూ యువతీవయుకులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రశ్నించి లోపలికి అనుమతించకపోవడంతో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News