Monday, December 23, 2024

తెలంగాణలో జిఎస్‌డిపి 16 శాతం పెరిగింది: కాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక ఇచ్చింది. తెలంగాణ జిఎస్‌డిపి 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని, రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని, సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని, 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని, రూ.2749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదికలో పేర్కొంది.

2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం పెరిగాయని, సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని, 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసిందని, ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించిందన్నారు. రాష్ట్రాభివృద్ధి రుణాల వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని, ఎపి నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని, ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయల్‌ఫామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదని, దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కాగ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News