Wednesday, January 22, 2025

దవాఖానాల డైట్ ఏజెన్సీల్లో ఎస్‌సిలకు 16% రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -

16% reservation to agencies owned by SCs in hospital management

500 పడకల ఆస్పత్రులలో కల్పిస్తూ జిఒ విడుదల

డ్రా ద్వారా ఆస్పత్రుల నిర్ణయం రిజర్వ్
చేసిన ఆస్పత్రికి బిడ్ ఒక్కటి వచ్చినా
గుర్తింపు కనీస టర్నోవర్ 50శాతానికి
తగ్గింపు ఒక్క బిడ్డు కూడా రాకపోతే
ఓపెన్ టెండర్లు సిఎం కెసిఆర్
ఆదేశాలకు మేరకు మంత్రి హరీశ్‌రావు
మార్గదర్శకత్వంలో కొత్త విధానం
రూపకల్పన ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ పాలసీని
తీసుకొస్తూ జిఒ 31 విడుదల ఆస్పత్రుల్లో
బెడ్ల వారీ పారిశుద్ధ ఖర్చు పెంపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌సిలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం తాజాగా హాస్పిటళ్లలో పోషకాహారం అందించే(డైట్) ఏజెన్సీలకు దీనిని వర్తింపజేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్ రావు మార్గనిర్దేశనంలో ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించింది. ఈ మేరకు తాజాగా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ జిఒ 32ను విడుదల చేశారు. ఎస్‌సిలకు 16 శాతం ఏజెన్సీలను కేటాయించాలని పేర్కొన్నారు. 500 ప డకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానలకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం హాస్పిటళ్లను రెండు కేటగిరీలుగా విభ జించారు.

100 వరకు బెడ్లు ఉన్న హాస్పిటళ్లను ఎ కేటగిరీగా, 500 వరకు బెడ్లు ఉన్న హా స్పిటల్‌లను బి కేటగిరిగా నిర్ధారించింది. ఏ హాస్పిటల్లో రిజర్వేషన్ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారించాలి. కనీస టర్నోవర్‌ను 50 శాతానికి తగ్గించాలి. రిజర్వ్‌డ్ హాస్పిట కు ఒక్క బిడ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కటి కూడా రాకపోతే మరోసారి టెండర్లను పిలవాలి. అప్పుడు కూడా బిడ్లు రా కపోతే ఓపెన్ టెండర్లు పిలువాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ సభ్యులుగా టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి మెంబర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ నూతన పాలసీ అమలుతో పాటు పర్యవేక్షిస్తుంది.

కొత్తగా ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ పాలసీ

రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం నూతన ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‘ (ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్) పాలసీని తీసుకువచ్చింది. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో నూతన పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ తాజాగా జి.ఒ.31ని విడుదల చేశారు. ఒక్క బెడ్‌కు నెలకు చేసే పారిశుద్ద్య ఖర్చును 7,500 రూపాయలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీనిని నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లకు వర్తింపజేస్తున్నట్లు ఉత్వర్లుల్లో వెల్లడించారు. గత ఏడాది నమోదైన బెడ్ల ఆక్యుపెన్సీ లేదా మంజూరైన పడకల సంఖ్యలో 50 శాతంలో ఏది ఎక్కువ అయితే దాని ఆధారంగా రికనబుల్ బెడ్ స్ట్రెంత్ (ఆర్‌బిఎస్)ను నిర్ణయించాలని అన్నారు.

ప్రస్తుతం ప్రతి 7 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27 వేల చదరపు అడుగులకు ఒకరిని నియమించే విధానం ప్రస్తుతం అమల్లో ఉండగా, తాజాగా మెడికల్ కాలేజీలకు వర్తించే ఈ విధానాన్ని నర్సింగ్ కాలేజీలకు,నర్సింగ్ పాఠశాలలకు (హాస్టల్స్‌తో సహా) కూడా ప్రభుత్వం విస్తరించింది. తాజా ఉత్తర్వుల ప్రకారంక 200 ఆపై పడకల్ ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలువాలి. 200లోపు పడకలు ఉన్న హాస్పిటళ్లకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలువాలి. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను జిల్లా స్థాయిలో నిర్వహించాలి. జిల్లా ఆరోగ్య సంఘం ఐహెచ్‌ఎఫ్‌ఎంఎష్ ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. పారిశుద్ధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించేలా కార్మికులకు నైపుణ్యం పెంపుదలలో ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహాయం అందిస్తుంది. పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News