Monday, December 23, 2024

పిడుగుపాటుతో విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిషాలో శనివారం ఓ స్కూల్‌పై పిడుగుపడిన ఘటనలో 16 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాష్ట్రంలోని కేంద్రపడ జిల్లాలోని గరద్‌పూర్ పాఠశాల విద్యార్థులు తరగతి గదుల నుంచి వెలుపలికి వస్తున్నప్పుడే పిడుగుపడింది. గాయపడ్డ వారంతా 6, 7వ తరగతి విద్యార్థులే, గాయపడిన చిన్నారులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడైంది. గాయపడ్డ వారిని అత్యవసరంగా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స చేపట్టారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News