Friday, January 10, 2025

16 మంది తహసీల్దార్‌లకు పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

16 మంది తహసీల్దార్‌లకు పదోన్నతులు
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 16 మంది తహసీల్దార్లు, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక సిసిఎల్‌ఏ ఆఫీసర్‌కు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కె.మహేశ్వర్, తహసీల్దార్, ఎం సూర్య ప్రకాశ్, తహసీల్దార్, మురళీ కృష్ణ, తహసీల్దార్, కె.మాధవి, తహసీల్దార్, పి.నాగరాజు, సెక్షన్ ఆఫీసర్, ఎల్. అలివేలు, తహసీల్దార్, బి.శకుంతల, తహసీల్దార్, కె.సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్, పి.మాధవి దేవి, సిసిఎల్‌ఏ ఆఫీస్, వి.సుహాసిని, తహసీల్దార్, భూక్యా బన్సీలాల్, తహసీల్దార్, బి.జయశ్రీ, తహసీల్దార్, ఎం.శ్రీనివాస్ రావు, తహసీల్దార్, డి.దేవుజ, తహసీల్దార్, డి.ప్రేమ్‌రాజ్, తహసీల్దార్, ఐవి భాస్కర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్, ఉప్పల లావణ్య, తహసీల్దార్, డి.చంద్రకళ, తహసీల్దార్, ఆర్వీ. రాధాబాయి, తహసీల్దార్‌లు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News