Sunday, December 22, 2024

సల్మాన్‌కు ఫోన్‌లో బెదిరింపు: 16 ఏళ్ల బాలుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతానంటూ పోలీసు కంట్రోల్ రూముకే ఫోన్ చేసి బెదిరించిన ఒక 16 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసుకు చెందిన మెయిన్ కంట్రోల్ రూముకు సోమవారం ఫోన్‌కాల్ వచ్చిందని, సల్మాన్ ఖాన్‌ను చంపుతానంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక సాయంతో ఆ ఫోన్ నంబర్ పొరుగున ఉన్న థాణే జిల్లాలోని షాహాపూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ముంబైకు 70 కిలోమీడర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి ముంబై పోలీసు బృందం ఒకటి బయల్దేరి వెళ్లింది. కంట్రోల్ రూముకు ఫోన్ చేసింది ఒక 16 ఏళ్ల బాలుడని పోలీసులు కనుగొన్నారు.

రాజస్థాన్‌కు చెందిన ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుని తదుపరి న్యాయ ప్రక్రియ కోసం ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీసులకు అప్పగించారు. 57 ఏళ్ల సల్మాన్ ఖాన్‌ను ఎందుకు బెదిరించాడో దర్యాప్తులో తేలవలసి ఉంది.
గత నెలలో కూడా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడంతో ఆయన భద్రతను ముంబూ పోలీసులు మరింత బలోపేతం చేశారు. సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తామంటూ ఇమెయిల్ ద్వారాబెదిరించినందుకు ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతం వై ప్లస్ కేటగిరి భద్రతను పోలీసులు కల్పించారు. ఆయన తన వ్యక్తిగత అంగరక్షకులతో కలసి బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News