Monday, January 20, 2025

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల బాలుడి అమానుషం

- Advertisement -
- Advertisement -

రేవా: ఓ 16 ఏళ్ల బాలుడు 58 మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను సుత్తితో తీవ్రంగా కొట్టి దారుణంగా హత్య చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం ఆ బాలుడు మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడని ఆ మహిళకుటుంబ సభ్యులు ఆరోపించడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. హనుమన పోలీసు స్టేషన్ పరిధిలోని కైలాష్‌పురి గ్రామంలో గత నెల 30న ఈ సంఘటన జరిగింది. అత్యాచారానికి పాల్పడడానికి ముందు ఆ బాలుడు ఆ మహిళ నోట్లోకి ప్లాస్టిక్ బ్యాగును, గుడ్డలు కుక్కి అరవకుండా చేసి అనంతరం ఆమె నివసిస్తు న్న భవనంలో నిర్మాణంలో ఉన్న భాగంలోకి లాక్కెళ్లాడు. అనంతరం సుత్తితో ఆమె తలపైన, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టడంతో పాటుగా గుప్త్తాంగాలను ఓ కర్రతో తీవ్రంగా గాయపరిచినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. రెండేళ్ల క్రితం ఆ బాలుడు మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతను ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ అధికారి చెప్పారు.

నిర్మాణంలో ఉన్న భవనంలో 58 ఏళ్ల మహిళ మృతదేహం పడిఉన్నట్లు ఈ నెల 1వ తేదీన తమకు సమాచారం అందినట్లు అదనపు సోలీసు సూపరింటెండెంట్ వివేక్ లాల్ చెప్పారు. పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని గుర్తుతెలియని వ్యక్తి మహిళను దారుణంగా హత్యకు గురి చేసినట్లు గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో పాటుగా దర్యాప్తు అనంతరం ఆమె ఇంటిపక్కన ఉండే బాలుడే ఈ హత్య చేసి ఉంటాడనే అభిప్రాయానికి వచ్చినట్లు ఆ అధికారి చెప్పారు. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా రెండేళ్ల క్రితం టీవీ చూడడం కోసం తరచూ తమ ఇంటికి వచ్చే ఆ బాలుడిపైనే అనుమానం వ్యక్తం చేశారని ఆ అధికారి చెప్పారు. అతను మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు అప్పట్లో మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారని, ఆ సంఘటన బాలుడికి, మహిళ కుటంబ సభ్యులకు మధ్య శత్రుత్వానికి దారి తీసినట్లు పోలీసులు చెప్పారు. దొంగతనం ఆరోపణల కారణంగా గ్రామంలో తాను అవమానం ఎదుర్కోవలసి రావడంతో బాలుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడని ఎఎస్‌పి వివేక్ లాల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News