Monday, December 23, 2024

18 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచిన 16 ఏళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ శాన్యఢిల్లీ లోని వెల్‌కమ్ ఏరియాలో కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల బాలుడు 18 ఏళ్ల యువకుడిని అనేకసార్లు కత్తితో పొడవడమే కాక, పైశాచిక ఆనందంతో మృతదేహం వద్ద డ్యాన్సు చేశాడు. ఈ దృశ్యాలన్నీ ఆ ఏరియాలోని సిసిటివి కెమెరాలో చిక్కుకున్నాయి. ఈ నేరం చేసిన సమయంలో నిందితుడు తప్పతాగి ఉన్నాడని ఆయా వర్గాలు వెల్లడించాయి. బాధితుడి నుంచి రూ.350 దొంగిలించడానికే నిందితుడైన బాలుడు ఈ విధంగా వికృతంగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది.

నిందితుడు మొదట బాధితుని గొంతు పిసికి ఊపిరాడకుండా చేయడంతో బాధితుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత బాధితుడి శరీరాన్ని ఇరుకైన వీధి లోకి ఈడ్చుకెళ్లి నిందితుడు చాలాసార్లు కత్తితో పొడిచాడు. బాధితుడి జేబులు వెతికి రూ.350 కాజేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాలుడిలా కాకుండా పెద్దవాడిలా కోర్టులో విచారించడానికి దాఖలు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.ఈ సంఘటనకు కారణం నిందితుడిని అడగ్గా డబ్బుకోసమే అని చెప్పాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News