Monday, December 23, 2024

160 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండలంలోని ఉప్పుగల్లు శివారులో అక్రమంగా లారీలో తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై బి మాధవ్‌గౌడ్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీలో తరలిస్తున్న 160 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. వీటి విలువ సుమారుగా రూ.4.16 లక్షలు ఉంటుందన్నారు.

లారీతో పాటు 5 మొభైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి కి చెందిన ముడావత్ నర్సింహ చుట్టు పక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించుకుంటూ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన గుగులోతు నర్సింహ, తేజావత్ ప్రకాశ్, మెదక్ జిల్లాకు చెందిన మాలోతు సుమన్, సిద్దిపేట్ జిల్లాకు చెందిన కమ్మదారి నవీన్, కమ్మదారి మల్లేశ్,

దేవి మహేశ్ లు పట్టుబడగా నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన ముడావత్ నర్సింహ, గుగులోతు రాజు, గుగులోతు రామ్‌చందర్‌లు పరారైనట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఏసిపి డా ఎం జితేందర్ రెడ్డి, సిఐ శ్రీనివాస రావు, ఎస్సైలు లవన్ కుమార్, ఎండి నిస్సర్ పాషా, బి షరత్ సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News