Wednesday, January 22, 2025

నీట్‌లో టాపర్స్‌గా 160మంది ఎస్‌సి గురుకుల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బుధవారం రాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. మొత్తం 160 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం గమనార్హం. వీరు మెడిసిన్‌లో అడ్మీషన్లు పొందే అవకాశం ఉంది. ఉత్తమ ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా గ్రామీణ నేపథ్యం ఉన్నవారే. వారి తల్లిదండ్రులు కూలీలుగా, మేస్త్రీలుగా, రైతులుగా, ఆటోడ్రైవర్లుగా, ఇంటి పనిమనిషులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవారు కావడం గమనార్హం. 160 మంది విద్యార్థులు అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించడం, వారంతా ఈ సంవత్సరం మెడికల్ సీట్లను పొందే అవకాశం ఉంది. ఎస్‌సి క్యాటగిరిలో జి. అభిషేక్ 912 ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు. తాను ర్యాంకు సాధించడం గొప్పగా అనిపిస్తుందని, నాలాంటి పేద విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక నీట్ కోచింగ్ అందించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత నీట్ కోచింగ్ లేకపోతే తాను డాక్టర్ కావాలనే కలను నేరవేర్చుకోలేకపోయేవాడినని పేర్కొన్నాడు. మారో టాపర్ శ్రీజ ఎస్‌షి కేటగిరిలో 4,723 ఆల్ ఇండియా ర్యాంకు సాధించింది. ఆ అమ్మాయి ఏడవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి చిన్న ప్రైవేట్ కంపెనీలో సేవకురాలిగా పనిచేస్తోంది. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. తను న్యూరాలజిస్టుగా పేద ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయి పేర్కొన్నారు. టాపర్లను గురుకులాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల నుండి 500 మందికి పైగా విద్యార్థులు, వైద్య కళాశాలల్లో చేరడం గర్వంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను నీట్, ఐఐటి, ఎన్‌ఐటి ల కోసం సిద్దం చేసే బృహత్తర మిషన్‌ను దేశంలో ఏ రాష్ట్రం చేపట్టలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అంకిత భావానికి నిదర్శనమన్నారు.

160 SC Gurukul Students get top ranks in NEET 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News