Wednesday, January 22, 2025

ప్రాణాలు కోల్పోయిన 16, 000 మంది..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఇజ్రాయెల్‌ హమాస్ యుద్ధంలో మహిళలు, పిల్లలే ప్రధాన బాధితులుగా ఉంటున్నారని, ఇప్పటివరకు 16,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన లింగ సమానత్వ సంస్థ వెల్లడించింది. ఈ యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి ప్రతిగంటకు ఇద్దరు తల్లులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని అంచనాగా పేర్కొంది. వందరోజులకు పైగా సాగుతున్న ఈ పోరులో కనీసం 3000 మంది కుటుంబ పెద్దలైన మహిళలు వితంతు లయ్యారని, దాదాపు 10 వేల మంది పిల్లలు తమ తండ్రులను కోల్పోయారని తెలియజేసింది. లింగసమానత పెరగడంతోపాటు , మహిళలపై కుటుంబ భారం పెరగడంతో పిల్లలతో పోట్లాడుకుంటూ వారిని విడిచిపెట్టి పారిపోతున్నారని,

నిరాశ్రయులుగా మరీమరీ మిగిలిపోతున్నారని సంస్థ వెల్లడించింది. 2.3 మిలియన్ జనాభాలో 1.9 మిలియన్ మంది నిరాశ్రయులై దిక్కు తోచనిస్థితిలో ఉన్నారని వీరిలో మిలియన్ మంది మహిళలు, బాలికలేనని వీరంతా ఆశ్రయం, భద్రత కోరుకుంటున్నారని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బహోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్ 7న హమాస్ దాడికి పూర్వం 15 ఏళ్లలో గాజా, వెస్ట్‌బ్యాంక్‌ల్లో చనిపోయిన వారిలో 67 శాతం మంది పురుషులు, 14 శాతం కన్నా తక్కువ మహిళలు ఉన్నారని, ఇప్పుడు మహిళలు, పిల్లలు సంఖ్యే అత్యధికంగా కనిపించడం విలోమ పద్ధతిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News