న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం నాటికి కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 కి చేరింది. వీటిలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711 గా ఉంది. శనివారం మరో 31 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,25,199 కి పెరిగింది. అదే సమయంలో రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది. గత 24 గంటల వ్యవధిలో 2143 క్రియాశీలక కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతంగా , వారపు పాటిజిటివిటీ రేటు 3.81 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య మొత్తం 4,28,65,519 గా ఉంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 197.95 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు. కొత్తగా నమోదైన 31 మరణాల్లో 14 కేరళ నుంచి, మహారాష్ట్రలో ఐదు, పశ్చిమబెంగాల్‌లో మూడు, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మిజోరంలో రెండు చొప్పున మరణాలు సంభవించాయి.
దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -