Friday, April 4, 2025

ఇండోనేషియాలో భూకంపం… 162 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 162 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. జకార్తాకు 75 కిలో మీటర్ల దూరంలో సింజూర్ భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని భూగర్భ పరిశోధన అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. 2200 ఇండ్లు కూలిపోయాయి. 5300 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News