- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనా కారణంగా మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో ఎపిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724కు పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన బాధితుల సంఖ్య 13,154కు చేరింది. గత 24 గంటల్లో 2,744 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,5,000మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
1628 New Corona Cases Reported in AP
- Advertisement -