- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,326 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, నిన్న ఒక్కరోజు కరోనాతో 666 మంది మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 3.40కోట్లకు చేరింది. కరోనాతో దేశవ్యాప్తంగా 4,53,708మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1.73లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.గత 24 గంటల్లో కరోనా నుంచి 17,677 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 3.35కోట్లకు పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.16 శాతంగా కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 101.30కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.
16326 New Corona Cases Reported in India
- Advertisement -