- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,999 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 164 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,72,367కు పెరిగింది. తాజాగా 186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,64,588 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,964కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.84 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,815 యాక్టివ్ కేసులున్నాయి.
- Advertisement -