- Advertisement -
షాంఘై : చైనాలో గడచిన 24 గంటల్లో 16,412 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం ఆందోళనకు గురిచేస్తోంది. చైనా ప్రభుత్వం 27 ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారే ఉన్నారు. కేసులు ఎక్కువ కావడంతో మరింత కఠిన ఆంక్షలను విధించాలనే యోజనలో అధికారులు ఉన్నారు.
- Advertisement -