Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

16561 new covid cases reported in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు నిన్నటితో పోల్చితో నేడు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,561 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,557కి పెరిగింది. అందులో 4,35,73,094 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 5,26,928 మందిని కరోనా మహమ్మారి కబలించింది. దేశంలో ప్రస్తుతం 1,23,535 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా 18,053 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 49 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 5.44 శాతంగా ఉందని, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.47 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News