Wednesday, February 12, 2025

గులియన్ బారే సిండ్రోమ్ కేసులు..ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 గులియన్ బారే సిండ్రోమ్ అనుమానిత కేసులు నమోదు కాగా అందులో 162 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు. మిగతా ఆరు కేసులపై అనుమానాలు అధికారులు చెబుతున్నారు. 167 కేసుల్లో పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39, ఇతర గ్రామాల నుంచి 91, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 29, పుణె రూరల్ ఏరియాలో 25.

ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం 48 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. అందులో 21 మంది వెంటిలేటర్లపై ఉన్నట్టు అధికారులు తెలిపారు. చికిత్స తరువాత 91 మంది డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేసుల నివారణ చర్యలు చేపట్టింది. పుణె నగరం లోని సింహగడ్ రోడ్డులో , పరిసర ప్రాంతాల్లో 30 ప్రైవేట్ నీటిసరఫరా ప్లాంట్లను సీజ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News