Monday, December 23, 2024

భారత్‌లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
168063 new Covid cases reported in India
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 4461 కి చేరాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. సోమవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, అందులో 1,68,063 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు కంటే కేసులు 6.4 శాతం మేర తగ్గాయి. పాజిటివిటీ రేటు 10.64 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 33 వేలు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో 19 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 3.58 కోట్ల మందికి వైరస్ సోకింది.

కరోనా రెండో దశ ఉద్ధృతి వేళ దేశంలో 2023 శాతం మంది రోగులు ఆస్పత్రుల్లో చేరారని, ఇప్పుడు మూడో దశలో ఆ సంఖ్య 510 శాతానికి పరిమితమైందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సోమవారం పేర్కొన్నారు. కానీ పరిస్థితులు గతిశీలంగా ఉన్నందున ఆస్పత్రుల్లో చేరికలు ఎప్పుడైనా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరించారు. సోమవారం 428 మందిలో ఒమిక్రాన్ గుర్తించారు. దీంతో మొత్తం కేసులు 4461 కి పెరిగాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1247 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడగా, రాజస్థాన్, ఢిల్లీలో ఆ సంఖ్య 645, 546 గా ఉంది. దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 8,21,446 కి చేరింది. క్రియాశీల రేటు 2.29 శాతానికి పెరగ్గా, రికవరీ రేటు 96.36 శాతానికి తగ్గిపోయింది. సోమవారం 69,959 మంది కోలుకున్నారు.

మొత్తం 3.45 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 277 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు 4,84,213 మంది మృతి చెందారు. దేశంలో సోమవారం 92,07,700 మంది టీకా తీసుకున్నారు. మొత్తం 152 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే సోమవారం నుంనచి ఆరోగ్య సిబ్బంది , ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషనరీ డోసు ఇస్తున్నారు. సోమవారం 10.5 లక్షల మందికి పైగా ఆ డోసు తీసుకున్నట్టు కేంద్రం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News