Wednesday, January 22, 2025

పేపర్ లీక్ కేసులో 16వ ర్యాంకర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
రూ.30 లక్షలకు డీల్

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. సిట్ మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగం పెంచడంతో నిందితులు ఒక్కరూ ఒక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఈ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించిన ఎం నాగరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రూ.30 లక్షలు ఇచ్చేందుకు రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎం నాగరాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం. నాగరాజు ఏఈ పరీక్ష పత్రాన్ని రమేష్ నుంచి కొనుగోలు చేశాడు. విచారణలో భాగంగా తేలడంతో సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజు అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 54కు చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News