Sunday, December 22, 2024

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్లెక్కిన పోలీసు భార్యలు

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో, హాజీపూర్ మండలం గుడపేట బెటాలియన్ ముందు లక్సెట్టిపేట మంచిర్యాల జాతీయరహదారిపై, డిచ్‌పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు 7వ బెటాలియన్ ఎదుట 44వ జాతీయ రహదారిపై 17వ బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. మా భర్తలను లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేపిస్తున్నారని ఆందోళన చేశారు. పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని అంటున్నారు. రోడ్లెక్కిన పోలీసు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అరెస్టు చేసి 17వ బెటాలియన్‌కు తరలించారు.

44వ జాతీయ రహదారిపై పోలీసు కుటుంబ మహిళలు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టిన సందర్భంలో 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న కెటిఆర్ పోలీసు కుటుంబ సభ్యుల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి కెటిఆర్ సంఘీభావం తెలిపారు. పోలీసు కుటుంబ సభ్యులకు బిఆర్‌ఎస్ మద్దతుగా ఉంటుందని ఎవరూ ఆందోళన చెందవద్దని, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావనపై మాట్లాడతానని హామీ ఇచ్చిరు. కార్యక్రమంలో 7వ బెటాలియన్ పోలీసు సిబ్బంది, కుటుంబసభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన కెటిఆర్ వాహనాన్ని నిలిపవేసి వారి సమస్యలను చెప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News