బీజింగ్: చైనా దేశం చాంగ్‌చున్ నగరంలో రెస్టారెంట్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో 17 మంది సజీవదహనమయ్యారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబందించిన వీడియోలు వైరల్‌గా మారాయి. గత సంవత్సరం జూన్ నెలలో ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 18 మంది విద్యార్థులు చనిపోయారు. గతేడాది జులై నెలలో జిలిన్ ప్రొవిన్స్ జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. 2010లో షాంఘైలోని 28 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 58 మంది దుర్మరణం చెందారు. 2017లో బీజింగ్ లోని జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు.
చైనాలో అగ్నిప్రమాదం: 17 మంది సజీవదహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -