Thursday, January 23, 2025

మెక్సికోలో పడవ మునిగి: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికో: నదిలో పడవ మునిగి 17 మంది మృతి చెందిన సంఘటన బహమాస్ దేశంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. న్యూ ప్రొవిడెన్స్ కు ఎనిమిది మైళ్ల దూరంలో డబుల్ ఇంజన్ పడవ 60 మంది వలసదారులతో బహమాస్ ప్రాంతం నుంచి మియామి ప్రాంతంలో వెళ్తుండగా నీళ్లలో అది మునిగిపోవడంతో 15 మంది పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందారు. ఈ ప్రమాదంలో 25 మందిని స్థానిక భద్రతా బలగాలు కాపాడాయి. హైటన్ ప్రధాన మంత్రి ఎరియల్ హెన్రీ  ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. బహమాస్ ప్రధాన మంత్రి ఫీలిప్ బ్రేవ్ డేవిస్ మృతులకు సంతాపం తెలిపారు. మానవులను అక్రమ రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు డేవిస్ అనుమానం వ్యక్తం చేశాడు. భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News