Thursday, January 23, 2025

విశ్వంభర కోసం 17 భారీ సెట్టింగులు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ ఫాంటసీ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్‌ని నిర్మించారు. చిత్ర యూనిట్ ఏకంగా మొత్తం 17 గ్రాండ్ సెట్టింగులు వేసారట. వీటిలోని దాదాపు సినిమా పూర్తవుతుందని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ చాలా మేరకు పూర్తి కాగా మిగతా మొత్తం కూడా ఈ జూలై నాటికి పూర్తవుతుందని సమాచారం. ఆతరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్‌ఎక్స్‌ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News