కాబూల్ : ఇన్నాళ్లూ లొంగని పంజ్‌షీర్ వ్యాలీని అదుపు లోకి తెచ్చుకోవడం, నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌ను ఓడించడం తదితర విజయాలతో సంబరాలలో మునిగి తేలిన తాలిబన్లు గత రాత్రి సంతోషం పట్టలేక గాల్లోకి జరిపిన కాల్పుల్లో పలువురు చిన్నారులు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవుడి దయ వల్ల అఫ్గాన్ మొత్తం తమ నియంత్రణ లోకి వచ్చిందని, పంజ్‌షీర్ ఇప్పుడు తమ అధీనం లోకి వచ్చిందని తాలిబన్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు. కాల్పుల్లో చనిపోయిన 17 మంది మృతదేహాలతోపాటు గాయపడిన 41 మంది తమ ఆస్పత్రిలో చేరినట్టు కాబూల్ లోని ఎవర్జెన్సీ ఆస్పత్రి తెలిపింది. వీరంతా సంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన వారని పేర్కొంది. పంజ్‌షీర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న వార్తలను తాలిబన్ వ్యతిరేక దశం నేత అహ్మద్ మసౌద్ కొట్టి పారేశారు.
తాలిబన్ల సంబరాలు : 17 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -