- Advertisement -
లావోస్‌లో భద్రత లేని, అక్రమంగా పని చేసేలా ప్రలోభానికి గురైన 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం వెల్లడించారు. ఈ కేసులో భారతీయ కార్మికుల విముక్తికి జయప్రదంగా కృషి చేసినందుకు లావోస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మంత్రి అభినందించారు. ‘మోడీ కీ గ్యారంటీ దేశంలోను, విదేశాల్లోను అందరికీ పని చేస్తుంది. లావోస్‌లో భద్రత లేని, అక్రమమైన పని చేసేలా ప్రలోభానికి గురైన 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు’ అని జైశంకర్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘బాగా చేశారు లావోస్‌లోని భారత రాయబార కార్యాలయం. వారిని సురక్షితంగా తిరుగు ప్రయాణానికి అండగా నిలిచినందుకు లావోస్ అధికారులకు ధన్యవాదాలు’ అని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -