Wednesday, January 22, 2025

లిబియా మాఫియా నుంచి 17 మంది భారతీయుల విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లిబియాకు చెందిన సాయుధ మాఫియా ముఠా బందీలో ఉన్న 17 మంది భారతీయుల విడుదలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అత్యంత చొరవ చూపించింది. ఈ నేపథ్యంలో వారంతా సురక్షితంగా తిరిగి ఆదివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. వీరంతా పంజాబ్, హర్యానాకు చెందిన వారు. ట్యూనిస్ లోని భారత దౌత్యకార్యాలయం ఈ విషయంలో కీలక పాత్ర వహించింది. మే 26న ట్యూనిస్ లోని భారత దౌత్యకార్యాలయం దృష్టికి ఆయా కుటుంబీకులు తీసుకు వచ్చారు. లిబియా లోని జ్వారా నగరంలో సాయుధ ముఠా వీరిని బందీ చేసింది.

ట్యూనిస్ లోని భారత దౌత్య కార్యాలయం రెగ్యులర్‌గా ఈ విషయంపై లిబియా ప్రభుత్వంతో గత మే, జూన్ నెలల్లో సంప్రదింపులు కొనసాగించింది. జూన్ 13న లిబియా ప్రభుత్వ అధికార యంత్రాంగం భారతీయులను సాయుధ ముఠా నుంచి రక్షించగలిగింది. అయితే వీరు అక్రమంగా లిబియా లోకి ప్రవేశించారని తమ కస్టడీలో వీరిని ఉంచింది. ట్యూనిస్ లోని భారత దౌత్యకార్యాలయ రాయబారి, న్యూఢిల్లీ లోని విదేశీ వ్యవహరాల సీనియర్ అధికారుల చొరవతో లిబియా ప్రభుత్వం వారిని విడిచి పెట్టడానికి అంగీకరించింది. లిబియాలో వారికి కావలసిన ఆహారం, దుస్తులు, మందులు , ఇతర అవసరాలను భారత దౌత్య కార్యాలయం సమకూర్చింది. వారికి పాస్‌పోర్టులు లేనందున అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేసి భారత్‌కు తిరిగి రప్పించ గలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News