Wednesday, September 18, 2024

గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులకు 17 మంది బలి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్‌హమాస్ యుద్ధంలో తాజాగా గాజా స్ట్రిప్‌లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఇజ్రాయెల్ సాగించిన దాడుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. పదినెలల పాటు సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాల నేతలు ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుపుతున్నాయి. సెంట్రల్ గాజా లోని 1948 నాటి నసీరత్ శరణార్థుల శిబిరం లోని కుటుంబంపై మంగళవారం రాత్రి దాడి జరిగి ఐదుగురు పిల్లలు మృతి చెందారు. వీరంతా 2నుంచి 11 ఏళ్ల లోపు వారే. వీరి తలిదండ్రులు కూడా బలైపోయారు. ఈ పిల్లల మృతదేహాలు శిరచ్ఛేదనమై ఉన్నాయని అసోసియేట్ ప్రెస్ రిపోర్టర్ చెప్పారు.

బుధవారం తెల్లవారు జామున మఘాజీ శరణార్థ శిబిరం సమీపాన ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఖాన్ యూనిస్ నగరంలో మంగళవారం రాత్రి జరిగిన దాడిలో నలుగురు చనిపోయారు. బెయిట్ లాహియా నగరంలో ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు మిలిటెంట్లా లేక పౌరులా అన్న విషయాన్ని గాజా ఆరోగ్య వర్గాలు స్పష్టం చేయడం లేదు. ఇజ్రాయెల్ మాత్రం పౌరులకు హాని కలగకుండా తాము ప్రయత్నిస్తున్నామని, హమాస్ దాడులే మరణాలకు కారణమని ఆరోపిస్తోంది. నివాస ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News