Thursday, January 23, 2025

నిరుద్యోగులకు వరం టిఎస్ ఐపాస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సులభంగా అనుమతులు మంజూరు చేసేందుకు టిఎస్ఐ పాస్‌ను అమల్లోకి తీసుకు వచ్చింది. 2014 లో ప్రవేశ పెట్టిన ఈ విధానంలో 17,26,178 మందికి ఉపాధి లభించినట్లు ఎస్‌ఇఒ ( తెలంగాణ సోషల్ ఆర్దిక ముఖ చిత్రం) ఒక నివేదికలో పేర్కొ ంది. టిఎస్ ఐ పాస్ విధానంలో అన్ని ప్రాజెక్టులకు 30 రోజుల వ్యవధిలో అనుమతులు లభిస్తాయి. ఒ క వేళ ఆ విధంగా అనుమతులు లభించనట్లయితే 31వ రోజు అనుమతి లభించేనట్లే అని భావించాల్సి ఉంటుంది. టిఎస్ ఐ పాస్ అమలు ద్వారా రాష్ట్రంలో పరిపాలన భారం చాలా వరకు తగ్గడమే కాకుండా పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రం ఇచ్చిన హ మీ ‘క్లియరెన్స్ హక్కు’ను అమలు చేయడంలో ఈ వ్యవస్థ చాలా కీలకమైంది.

టిఎస్ ఐ పాస్ ద్వారా గత 2014 నుంచి 2023 వరకు వరకు 22,110 యూనిట్లకు అనుమతి లభించడంతో రూ.2, 53,575 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తరలి రావడంతో ఉపాధి అవకాశాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. టిఎస్ ఐ పాస్ అమల్లోకి వచ్చిన మొద టి ఆర్దిక సంవత్సరం 201516తో పోలిస్తే టిఎస్ ఐ పాస్ ద్వారా వచ్చిన అనుమతుల సంఖ్య 20 2223 నాటికి 7.4 శాతం కాంపౌండ్ వార్షిక వృ ద్ధిరేటుతో ( సిఎజిఆర్) గణనీయంగా పె రిగింది. 202223లో ఇచ్చిన అనుమతుల సంఖ్య 2518 అయినప్పటికి ఇప్పటి వరకు చేసిన పెట్టుబడులు రూ ః 20,237 కోట్లు. ఇవి 202122తో పోలిస్తే రూ.18,916 కోట్లు అధికంగా ఉన్నటు ఎస్‌ఇఒ( తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం నివేదిక ) తెలిపింది. పీరియాడికల్ లేబర్ సోర్స్ 202021 ప్రకారం రాష్ట్రంలోని శ్రామిక జనాభాలో 21 శాతం పారిశ్రామిక రంగం ద్వారా ఉపాధి పొందుతున్నట్లు తెలిపింది.అంటే రాష్ట్రంలో సుమారు 29,90043 మంది కార్మికులు పారిశ్రామిక రంగంలో నిమిగ్నమై ఉన్నారు.

ఈ రంగంలోని నిర్మాణం, తయారీ, ఉపరంగాలు రాష్ట్రంలోని శ్రా మిక శక్తికి అత్యధిక ఉపాధిని ఇస్తున్నాయి. అవి వరుసగా 8.82 శాతం నుంచి 10.95 శాతం రాష్ట్ర పారిశ్రామిక జనాభాకు ఉపాధిని కల్పిస్తున్నాయి. మిగిలిన రెండు ఉపరంగాలు, కలిపి రాష్ట్రశ్రామిక శక్తిలో 1.23 శాతం మందికి ఉపాధిని కల్పిస్తున్నా యి. పారిశ్రామిక శక్తిలో నిర్మాణం, తయారీ రం గం 41.99 శాతం, 52.15 శాతం ఉన్నాయి. అ యితే ఇతర రెండు ఉప రంగాలు కలిసి 5.86 % వాటాలికి ఉన్నాయి. మ్యాన్యుఫ్యాక్చర్ రంగం లో 42 శాతం, కనస్ట్రక్షన్ రంగంలో 52 శాతం కార్మికులు పని చేస్తుండగా మైనింగ్,3 శాతం విద్యుత్ ఇతర రంగాల్లో 3% పని చేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News