Thursday, January 23, 2025

ఘనాలో భారీ పేలుడు: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

17 Members dead in Huge explosion in Ghana mining

ఘనా: ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశం బొగొసో పట్టణంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. బంగారు గని తవ్వకాల కోసం పేలుడు పదార్థాలు తీసుకొని వెళ్తుండగా వాహనానికి బైక్ ఢీకొట్టడంతో  పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో 17 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. పోలీసులు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి 500 ఇండ్ల వరకు ధ్వంసంకాగా వంద ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News